హ‌న్సిక బ‌ర్త్‌డే..ఆక‌ట్టుకుంటున్న `మై నేమ్ ఈజ్ శృతి` ఫ‌స్ట్ లుక్!

హన్సిక‌ మోట్వాని.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను పలకరించిన ఈ బ్యూటీ.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు అందుకున్న హ‌న్సిక‌.. ఇటు తెలుగులోనే కాకుండా అటు త‌మిళంలోనూ ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు న‌టించి భారీ ఫాలోంగ్‌ను సంపాదించుకుంది.

Happy Birthday, Hansika Motwani: 5 interesting facts about the actress you  must know | The Times of India

ఇక నేడు హ‌న్సిక 30వ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆమె న‌టిస్తున్న మై నేమ్ ఈజ్ శృతి చిత్రం నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల అయింది. ఇందులో హ‌న్సిక సీరియ‌స్ లుక్‌లో ఏదో ఆలోచిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తున్నారు. ఆక‌ట్టుకుంటున్న ఈ పోస్ట‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై రమ్య బురుగు, నాగేందర్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకుడు.

hansika motwani my name is shruthi firstlook - Great Telangaana

ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొన్నది? వాటితో ఎలా పోరాడింది? అనే కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీలో హ‌న్సిక ఓ డిఫ‌రెంట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. కాగా, ఇటీవల సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని.. రెండో షెడ్యూల్‌కు రెడీ అవుతోంది.