హన్సిక గురించి తెలియని విషయాలు..

హన్సిక పూర్తి పేరు హన్సిక మోత్వాని. ఈమె ముంబై ప్రాంతంలో 1991 ఆగస్టు 9 న జన్మించింది. ఈమె తండ్రి పేరు ప్రదీప్ మోత్వాని, తల్లి పేరు మోనా మోత్వాని. ఇక కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవడం జరిగింది. హన్సిక మాత్రం ప్రస్తుతం తన తల్లి దగ్గర ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రోజు హన్సిక పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి తెలుసుకుందాం.

హన్సిక తన చిన్న వయసులో నుంచే బాల నటిగా పలు సీరియల్స్లోను ,సినిమాల్లోను నటించింది. 2007 లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, హన్సిక హీరోయిన్ గా నటించిన చిత్రం దేశముదురు. ఈ సినిమా నటించేప్పటికి ఆమె వయసు 16 సంవత్సరాలు కావడం గమనార్హం. ఈమె తన మొదటి సినిమాతోనే ఎంతో మంది ప్రేక్షకులను బాగా ఆకర్షించింది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 2008లో కంత్రి సినిమాలో హన్సిక నటించింది. అలాగే హీరో రామ్ తో మస్కా సినిమాలో నటించి , ఆ తర్వాత ప్రభాస్ సరసన బిల్లా సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఇక ఈమెకు కందిరీగ సినిమా ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నది తెలుగులో. ఇక ఈమె ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ వైపు అడుగు వేయగా, అక్కడ కోలీవుడ్ హీరో శింబుతో ప్రేమలో ఉన్నట్లు బాగా ప్రచారం జరిగింది.

కోలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టువంటి హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు. ఇక ఈ మధ్యనే బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక అంతే కాకుండా సూర్య సరసన సింగం-2 లో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందింది.