పాన్ ఇండియా మూవీ లోకి అడుగు పెట్టబోతున్న మెగా హీరో?

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల వాహ నడుస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మంచి కథ దొరికితే చాలు భారీ బడ్జెట్ పెట్టడానికి అయినా కూడా వెనకాడటం లేదు. అయితే ఇప్పటికే టాలీవుడ్ లో పలు పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ పాన్ ఇండియా సినిమాలలో కొందరు స్టార్ హీరోలు నటిస్తున్నారు. త్వరలోనే మరో మెగా హీరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ గని సినిమాలో నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.

వరుణ్ తేజ్ మరోవైపు వెంకటేష్ తో కలసి ఎఫ్ 3 సినిమాను కూడా పూర్తి చేసుకొని ఉన్నాడు. ఈ సినిమాల అనంతరం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం అక్కినేని నాగార్జున సినిమా ది గోస్ట్ సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమా తరువాత ప్రవీణ్ సత్తారు వరుణ్ తేజ్ తో సినిమా చేయడం ఖరారు అయినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ బాగా ఉండటంతో పాన్ ఇండియా మూవీ లాగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.