దళితుల పై ఆరోపణలు చేసిన విషయంలో హీరోయిన్ అరెస్ట్

మీరా మిథున్.. ఇటీవల ఆగస్టు 7వ తేదీన మీరా దళితుల పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు దళితులు సినీ ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఎంతోమంది సినిమా అవకాశాలను కూడా కోల్పోతున్నారు అంటూ ఆమె దూషించింది. అయితే మీరా చేసిన వ్యాఖ్యలను కొంత మంది విమర్శిస్తే, మరి కొంతమంది సపోర్ట్ చేశారు. అంతేకాదు మీరా సినీ ఇండస్ట్రీలో దళితుల కారణంగా ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొన్నది , ఇక ఈ బాధలు తట్టుకోలేక ఆమె ఒక్కసారిగా వారిపై దూషించడం మొదలు పెట్టింది. ఈమె బాధలను అర్థం చేసుకోలేక కొంతమంది ఈమెపై కేసు నమోదు చేయడం జరిగింది.

అయితే ఈ రోజు అనగా ఆగస్టు 14వ తేదీన మీరా మిథున్ ను కేరళ లోని తన నివాసంలో కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను ఎస్టి ఎస్సి అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది.ఇక ఈమె పై విదుతలై సిరుతైగల్ కట్చి నాయకుడు వన్నీ అరసు పిటిషన్ మేరకు ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఎస్ టి , ఎస్ సి ల పై చాలా ఘోరంగా మాట్లాడింది అంటూ ఆమెను అరెస్టు చేయించడం జరిగింది..

అయితే పోలీసులు మీరా మిథున్ ను అరెస్టు చేయకముందు ఆమె పోలీసులతో వాదన లాడడం కూడా మనం వీడియోలో గమనించవచ్చు. అంతేకాదు ఆమె పై పోలీసులు చెయ్యి వేస్తే చంపేస్తాను అని బెదిరించడం తో పాటు తనను కాపాడాలి అంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆమె సహాయం కోరినట్లు ఈ వీడియోలో గమనించవచ్చు.https://youtu.be/Nc8I_SXH2sc?t=7