నెట్‌ఫ్లిక్స్‌ కు షాక్..కోర్టు సంచలన నిర్ణయం…?

కరోనా వల్ల సినిమా రంగం తీవ్రంగా నష్టపోయింది. థియేటర్లు మూత పడటంతో పెద్ద పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కాలేదు. దీంతో ఓటీటీల ద్వారా సినిమాలను రిలీజ్ చేశారు. ఓటీటీల్లో మనం ముఖ్యంగా చెప్పుకుంటే నెట్‌ఫ్లిక్స్‌ బాగా పాపులర్ అయ్యింది. ఇటువంటి నెట్ ఫిక్స్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో రీలీజ్ అయిన ఎ బిగ్ లిటిల్ మర్డర్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ నెట్ ఫ్లిక్స్ కు తలనొప్పిని తెచ్చి పెట్టింది. జనవరి 8వ తేదీ 2018వ సంవత్సరంలో ఓ ఘటన చోటుచేసుకుంది.

గురుగ్రామ్‌కు చెందిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ వాష్‌రూమ్‌లో 7 సంవత్సరాల బాలుడు మృతిచెందాడు. ఆ కథతో నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీ ఫిల్మ్ అనేది రిలీజ్ అయ్యింది. ఆగస్టు 6వ తేది ఆ డాక్యుమెంటరీని రిలీజ్ చేయగా తమ పాఠశాల పేరును సూచించారని, దాని వల్ల తమ మనోభావాలను పూర్తిగా దెబ్బతిన్నట్లు ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో కోర్టు స్కూల్‌లో సీన్స్ తీసేసి డ్యాకుమెంటరీని ప్రసారం చేయాలన్నారు. ప్రస్తుతం దీని గురించే చర్చ కొనసాగుతోంది.