అర‌రే..నిహారిక‌ను నాగ‌బాబు అలా అనేశారేంటీ..?

నాగ‌బాబు ముద్దుల కూతురు, న‌టి నిహారిక గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఒక మనసు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నిహారిక‌.. స‌రైన హిట్ అందుకోలేక‌పోయినా న‌ట‌న ప‌రంగా మంచి మార్కులే వేయించుకుంది. ఇక గ‌త ఏడాది చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న నిహారిక‌.. కెరీర్‌ను ఆప‌కుండా స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేయాల‌ని చూస్తోంది.

Naga Babu Daughter Niharika Wedding buzz - tollywood

ఇందులో భాగంగానే ప్ర‌స్తుతం తండ్రి నాగ‌బాబుతో క‌లిసి నిహారిక ఓ సిరీస్ చేస్తోంది. వీరిద్ద‌రూ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలోనే షూటింగ్ స్పాట్‌లో ముచ్చ‌ట్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసిన నాగ‌బాబు.. నిహారిక‌ను `లేడీ డాన్‌` అని సంబోధిస్తూ తామిద్దరం వెబ్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉన్నామని తెలిపారు.

Niharika Konidela: Naga Babu : మై జాన్ అంటోన్న నిహారిక.. లేడీ డాన్ అంటూ  సెట్‌లో నాగబాబు! - nagababu and niharika on set ocfs web series | Samayam  Telugu

దాంతో ఆయ‌న చేసిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఇక ఈ పోస్ట్ బ‌ట్టీ చూస్తుంటే.. తండ్రీకూతుళ్ల రచ్చ మామూలుగా లేద‌ని స్ప‌ష్టంగా అర్థం అవుతోంది. కాగా, నాగ‌బాబు షేర్ చేసిన పిక్స్‌లో దర్శకుడు ప్రణీత్, గెటప్ శ్రీను కూడా క‌నిపిస్తున్నారు.

https://www.instagram.com/p/CSjjyH6F8u4/?utm_source=ig_web_copy_link