ఆగస్టు 19న ఆర్ఆర్ఆర్ రిలీజ్.. గ్యారెంటీ హిట్ అంటోన్న క్రేజీ అంకుల్స్

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యావత్ సినీలోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే పలు పోస్టర్స్ రూపంలో అనౌన్స్ చేశారు. కానీ తాజాగా రిలీజ్ అయిన ఓ టీజర్ మాత్రం ఆర్ఆర్ఆర్ ఆగస్టు 19న రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ప్రేక్షకులు అవాక్కయ్యారు.

అయితే ఆగస్టు 19న రిలీజ్ అవుతున్నది రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ కాదండోయ్.. యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమా. ఈ సినిమాలో మనో, రాజా రవీంద్ర, భరణి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో వీరి పేర్లు రావు గారు, రాజు గారు, రెడ్డి గారు అని ఉండటంతో వీరి ముగ్గురిని ‘ఆర్ఆర్ఆర్’ అని పిలుస్తుంటారు. అందుకే ఈ సినిమాకు ఆ పేరుతో హైప్ తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఇ.సత్తిబాబు. పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

ఓ అపార్ట్‌మెంట్‌లోకి కొత్తగా వచ్చిన అమ్మాయిని ‘ఆర్ఆర్ఆర్‌’లు తమ బుట్టలో పడేయాలని ప్రయత్నించే అంశాన్నే సినిమా కథగా సత్తిబాబు మనకు చూపించనున్నాడు. ఇక ఈ సినిమలో కామెడీని మరింత పండించేందుకు చాలా మంది ఇతర నటీనటులు ఉన్నారు. ఈ సినిమాను ఆగస్టు 19న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి అంటున్నారు ఆడియెన్స్.