భీమ్లా నాయక్ టీజర్‌లో అది పేలిపోనుందట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి మరికాసేపట్లో అదిరిపోయే ట్రీట్ రానున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాకు భీమ్లా నాయక్ అనే టైటిల్‌ను దాదాపు ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. కాగా ఈ టీజర్‌లో అదిరిపోయే అంశం మరోటి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ టీజర్‌కు థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ బీజీఎం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. భీమ్లా నాయక్ అనే పవర్‌ఫుల్ పాత్రలో పవన్ పర్ఫార్మె్న్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక యంగ్ హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తుండగా, ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకు బాగా కలిసొస్తుందట.

మొత్తానికి భీమ్లా నాయక్ పాత్రను ఎలివేట్ చేసే క్రమంలో థమన్ ఇచ్చే బీజీఎం ఏ1గా ఉండనుండగా, టీజర్‌లో వచ్చే బీజీఎం కూడా అదే రేంజ్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ టీజర్‌లో కేవలం పవన్‌ను మాత్రమే చూపిస్తారా లేక రానా దగ్గుబాటి పాత్రను కూడా పరిచయం చేస్తారా అనేది చూడాల్సి ఉంది. సాగర్ చంద్ర తెరకెక్కిస్తు్న్న ఈ సినిమాపై హైప్ ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. మరి థమన్ అందించబోయే బీజీఎం ఏ రేంజ్‌లో ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది నిమిషాలు వెయిట్ చేయాల్సిందే.