ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ఎట్టకేలకు ఇప్పుడే సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ముందు నుండీ అనుకుంటున్నట్లుగానే ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ టీజర్‌లో పవర్ స్టార్ లుంగీ కట్టులో తన విశ్వరూపాన్ని చూపించారు. విలన్‌ను పట్టుకునేందుకు లుంగీ పైకెత్తి మరీ ‘‘రేయ్ డానీ.. బయటకు రారా నా కొడకా’’ అంటూ పవర్‌ఫుల్ డైలాగుతో పవన్ తుక్కురేపాడు.
అటు టీజర్ మొత్తంలో థమన్ భీమ్లా థీమ్ వచ్చేలా అదిరిపోయ బీజీఎంతో అదరగొట్టాడు. త్రివిక్రమ్ అందించిన డైలాగులు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో ఈ చిన్న టీజర్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో రానా పేరును కూడా ఈ టీజర్‌లో రివీల్ చేశారు. డానియల్ శేఖర్ అని రానా స్వయంగా వాయిస్ ఓవర్‌లో చెప్పాడు. అయితే భీమ్లా నాయక్ చిత్రానికి ఎలాంటి క్యాప్షన్ లేదనే విషయాన్ని కూడా ఈ టీజర్‌లో చెప్పుకొచ్చారు. ‘ఏం చూస్తున్నావు.. కింద క్యాష్పన్ లేదనా.. అక్కర్లేదు బండెక్కు’ అంటూ వచ్చే డైలాగు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది.
మొత్తానికి అనుకున్నట్లుగానే భీమ్లా నాయక్ గ్లింప్స్ టీజర్ పగిలిపోయేలా ఉందని చెప్పాలి. పాత రికార్డులను ఈ టీజర్ తుడిచిపెట్టడం ఖాయమని పవన్ అభిమానులు అంటున్నారు. ఇంటెన్స్ యాక్షన్‌తో పవన్ రెచ్చిపోయి మరీ చెప్పే డైలాగులు పవన్ ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చడంతో ఈ సినిమాలో ఇలాంటివి ఇంకా చాలానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సాగర్ కె చంద్ర ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నాడని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమా ఆడియో సాంగ్స్‌ను సెప్టెంబర్ 2 నుండి రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. మరి ఈ పవర్‌ఫుల్ భీమ్లా నాయక్‌ను మీరూ ఓసారి చూసేయండి.