గెట్ రెడీ..విజ‌య్ సేతుప‌తి `సూపర్‌ డీలక్స్‌` వ‌చ్చేస్తుంది!

విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తికి.. త‌మిళంలోనే కాదు ఉప్పెన చిత్రం త‌ర్వాత తెలుగులోనూ సూప‌ర్ క్రేజ్ ఏర్ప‌డింది. దాంతో ఆయ‌న త‌మిళ సినిమాల‌ను తెలుగులో డ‌బ్ చేసి విడుద‌ల చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే విజ‌య్ న‌టించిన మ‌రో త‌మిళ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి త్యాగరాజన్ కుమార రాజ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా `సూపర్ డీలక్స్`.

బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ పాత్రలో న‌టించి.. ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాడు. అయితే ఈ చిత్రాన్ని.. విజయ్ క్రేజ్ దృష్ట్యా తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా సూపర్‌ డీలక్స్‌ను తెలుగులో తీసుకొస్తున్నామంటూ ట్విట్టర్‌ వేదికగా ప్ర‌క‌టించింది.

అంతేకాదు, ఈ డబ్బింగ్‌ చిత్రాన్ని ఆగస్టు 6 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు కూడా వెల్ల‌డించింది. కాగా, ఈ సినిమాలో సమంత, ఫాహద్, రమ్యకృష్ణ, మిస్కిన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 2019 లో విడుద‌లైన ఈ చిత్రం.. కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.