స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్న నాని..ఎందుకోస‌మంటే?

July 28, 2021 at 7:57 am

న్యాచుర‌ల్ స్టార్ నాని ఓ ట్యూట‌ర్ ద‌గ్గ‌ర ట్రైనింగ్ తీసుకుంటున్నాడ‌ట‌. ఇంత‌కీ ఈయ‌న ట్రైనింగ్ ఎందుకోసం..? అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది.. తెలంగాణ యాస‌పై ప‌ట్టు సాధించేందుకు నాని స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా.. ఇటీవ‌లె శ్యామ్ సింగ‌రాయ్‌ను కూడా పూర్తి చేశాడు.

ప్ర‌స్తుతం నాని వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో `అంటే సుందరానికీ` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

ఇక ఈ చిత్రం త‌ర్వాత శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడితో నాని ఓ సినిమా చేయ‌నున్నాడు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాత‌. అయితే ఈ చిత్రంలో నాని తెలంగాణ యువ‌కుడిగా క‌నిపించ‌బోతున్నాడు. ఆ పాత్ర కోసం నాని ఓ ట్యూట‌ర్‌ను పెట్టుకుని యాస నేర్చుకుంటున్న‌ట్టు స‌మాచారం.

స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్న నాని..ఎందుకోస‌మంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts