ప్ర‌భాస్ మూవీలో తొలిసారి ఛాన్స్ కొట్టేసిన స‌మంత‌?!

July 28, 2021 at 7:43 am

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో మొద‌టి సారి న‌టించ‌బోతోంది స‌మంత‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సలార్, రాధే శ్యామ్‌, ఆదిపురుష్‌ల‌తో పాటుగా ప్ర‌భాస్ ప్ర‌స్తుతం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్ క‌పిపించ‌నుండ‌గా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

వైజయంతి మూవీస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా `ప్రాజెక్ట్ కె` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది. మొద‌ట అమితాబ్‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చీత్ర‌క‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర కోసం మేక‌ర్స్ అక్కినేని వారి కోడ‌లు స‌మంత‌ను సంప్ర‌దించార‌ట‌. పాన్ ఇండియా మూవీ కావ‌డం మ‌రియు పాత్ర కూడా న‌చ్చ‌డంలో.. స‌మంత వెంట‌నే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే.. ప్ర‌భాస్ తో స‌మంత న‌టించే తొలి సినిమా ఇదే అవుతుంది.

 

ప్ర‌భాస్ మూవీలో తొలిసారి ఛాన్స్ కొట్టేసిన స‌మంత‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts