10 మిలియన్ ఫాలోవర్ల క్లబ్ లో విజయ్…?

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. హై ఎనెర్జిటిక్ మాస్ యాక్షన్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి ఒక ట్రెండ్ సెట్ చేశాడు. ‘గీతగోవిందం’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మన ‘రౌడీ బాయ్’ తాజాగా మరొక మైల్ స్టోన్ ను అధిగమించాడు.

అతి తక్కువ టైంలోనే 10 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో తనకున్న క్రేజ్ ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అయితే విజయ్ దేవరకొండ ఫేస్ బుక్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకోవడంతో అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాద్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా తరహాలో విడుదల కానుంది.