“ఫ్యామిలీ డ్రామా” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!

July 20, 2021 at 2:41 pm

కలర్ ఫోటో సినిమాతో హీరోగా వచ్చి తన సహజ నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసును గెలుచుకున్న సుహస్ తాజాగా మరో సరికొత్త చిత్రంలో మన ముందుకొచ్చాడు. మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫ్యామిలీ డ్రామా’లో హీరోగా నటిస్తున్నాడు. చాష్మ ఫిలిమ్స్, నూతన భారతి ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా..అజయ్, సంజయ్ లు చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు. పూజా కిరణ్, శృతి నోరీ ఫిమేల్ లు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. కాగా విడుదల చేసిన కొద్దిసేపట్లోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కలర్ ఫోటోలు ఎంతో అమాయక మొఖంతో, ఎంతో సహజంగా నటించి అందరిని అవాక్కయ్యేలా చేసిన సుహాన్ ఈ సారి ‘ఫ్యామిలీ డ్రామా’ సినిమాతో కూడా మంచి మార్కులు కొట్టేస్తాడా అనేది చూడాలి మరి.

“ఫ్యామిలీ డ్రామా” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts