సూపర్‌మార్కెట్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో శ్రుతి రొమాన్స్‌..షాక్‌లో నెటిజ‌న్లు!

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కూతురుగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతిహాస‌న్.. మంచి న‌టిగా ఫ్రూవ్ చేసుకోవ‌డంతోపాటుగా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇటీవ‌లె క్రాక్‌, వ‌కీల్ సాగ్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ల‌ను ఖాతాలో వేసుకుని మంచి జోరు మీద ఉన్న శ్రుతి.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్‌లో న‌టిస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్ర‌ముఖ ఆర్టిస్ట్ సంతాను హ‌జారిక‌తో శ్రుతి ప్రేమ‌లో ఉన్న‌ట్టు గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రు త‌ర‌చుగా క‌లుస్తుండ‌డంతో ఈ వార్త‌లు మ‌రింత వైర‌ల్ అయ్యాయి. ఇక తాజాగా సూప‌ర్ మార్కెట్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. శాంతను హజారికతో కలిసి ముంబైలోని ఓ సూపర్‌మార్కెట్‌కి శ్రుతి వెళ్ల‌గా.. అక్క‌డ జ‌నాలు ఫొటోలు తీయడం స్టార్ట్ చేశారు.

శృతీ కూడా శాంతనుకు హగ్గులిస్తూ, ముద్దులు పెడుతూ.. ఎంతో హుషారుగా ఫొటోల‌కు పోజులిచ్చింది. అంతేకాదు, ఇందుకు సంబంధించిన పిక్స్‌ను శ్రుతి స్వ‌యంగా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో యాడ్‌ చేసింది. ఇక వీటిని చూసి షాక్ అవ్వ‌డం నెటిజ‌న్ల వంతు అయింది. ఈ నేప‌థ్యంలోనే పబ్లిక్‌గా ఆ ముద్దులు, హ‌గ్గులు ఏంటీ? అంటూ ప‌లువురు నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.