‘అన్యాస్‌ ట్యుటోరియల్‌’ వెబ్‌సిరీస్‌లో రెజీనా..?

దేశవ్యాప్తంగా ఇప్పుడు వెబ్‌ సిరీస్‌ ల ట్రెండ్ నడుస్తుంది. కరోనా కారణంగా సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడడంతో కొందరు వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టారు. సినిమా లవర్స్ కూడా సిరీస్ లపై ఇంట్రెస్ట్ పెడుతుండడంతో స్టార్ హీరోయిన్ లు, యాక్టర్ లు అందరూ సిరీస్ లపై కన్నేశారు. అయితే తెలుగులో కొత్తగా ‘అన్యాస్‌ ట్యుటోరియల్‌’ పేరుతో ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ తెరకెక్కుతోంది. ఆహా, ఆర్కా మీడియా వర్క్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సిరీస్‌ కి పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

స్టార్ హీరోయిన్ రెజీనా ప్రధాన పాత్రలో నటిస్తుంది. అగస్త్య, నివేదా సతీష్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సిరీస్ షూటింగ్ ఇటీవల ప్రారంభం కావడంతో ఈ యూనిట్ నేడు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ.. ఓ లేడీ రైటర్‌ రాసిన ఈ హర్రర్ కథకు, దర్శకురాలు పల్లవి స్క్రీన్‌ప్లే రాసుకున్న విధానం నాకు బాగా నచ్చిందని అందుకే ఈ కథ వినగానే అందులో నటించాలి అని ఫిక్స్ అయ్యాను అంటూ రెజీనా చెప్పింది. ఈ సిరీస్‌ను నిర్మిస్తున్న ఆహా, ఆర్కా వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసింది.