పీల‌గా క‌నిపిస్తున్న రకుల్‌ .. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఎంత ఫిట్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ జిమ్ లో కసరత్తులు చేస్తూ… ఈ ముద్దుగుమ్మ తన శరీరాకృతిని ఎప్పుడు చెడి పోకుండా చూసుకుంటుంది. కానీ ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టడంతో భారీగా వర్కవుట్లు చేస్తూ….. పీల‌గా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను చూసిన ఈ ముద్దుగుమ్మ అభిమానులు ఎంతలా వద్దని వారిస్తున్నా…. జీరో సైజ్ కోసం తాను చెమటోడ్చుతూనే ఉంది.

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోలలో మరీ వింతగా కనిపిస్తోంది. టాలీవుడ్ లో ఈ ముద్దు గుమ్మ పనయిపోయిందని కథనాలు వచ్చినపుడు అందుకు ఈ అమ్మడు సెటైరికల్ గా బదులిచ్చింది. సంవత్సరానికి ఆరు సినిమాలు చేస్తున్నా… ఇంతకు మించి ఎవరైనా డేట్స్ అడ్జెస్ట్ చేసేవారుంటే చెప్పండని బదులిచ్చింది. తనకు డేట్లు అడ్జెస్ట్ కాకే తెలుగులో ఎక్కువ సినిమాలు చేయడం లేదని ఈ బ్యూటీ చెప్పకనే చెప్పిందని పలువురు చర్చించుకుంటున్నారు.