తాప్సీ ధరించిన ఈ చీర ధర ఏంటంటే..?

మంచు వారబ్బాయి మనోజ్ తో కలిసి రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝమ్మంది నాదం అనే మూవీతో బ్యూటీ తాప్సీ పన్ను టాలీవుడ్ కు పరిచయమైంది. తర్వాత అనేక సినిమాలు చేసినా ఈ అమ్మడుకి సరైన గుర్తింపు రాలేదు. దీంతో ఈ అమ్మడు తన మకాన్ని బాలీవుడ్ కు మార్చింది. బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత ఈ ముద్దు గుమ్మ చేసిన అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు హిట్ గా నిలిచాయి. దీంతో ఈ బ్యూటీకి అవకాశాలకు కొదువ లేకుండా పోయింది.

అయితే ఈ బ్యూటీ తాజాగా ధరించిన చీర అందరి దృష్టిని ఆకర్షించింది. ఆప్రో కంపెనీకి చెందిన ఈ చీరలో ఈ ముద్దు గుమ్మ మెరిసిపోయింది. దాదాపు 15,500 రూపాయల ధర ఉండే ఈ చీర ఆప్రో బ్రాండ్ కు చెందిది. అలాగే ఈ ముద్దుగుమ్మ ధరించిన ఇయర్ రింగ్స్ రియా బ్రాండ్ కి చెందినవట. వీటి ధర దాదాపు 5,290 రూపాయలు ఉంటుందని అందరూ చర్చించుకుంటున్నారు.