కీరవాణికి ఆర్ఆర్ఆర్ టీం స్పెషల్ విషెస్..!

టాలీవుడ్ లోనే అగ్ర సంగీత దర్శకుడు అయిన కీరవాణిది ఈరోజు పుట్టినరోజు . ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం ఆయ‌న ప‌నిచేస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ఆర్ఆర్ఆర్ యూనిట్ టీమ్ ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ అద్భుత‌మైన పోస్టర్ ను రిలీజ్ చేసింది. మా మ్యూజికల్ జీనియస్ ఎమ్.ఎమ్.కీరవాణి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని రాసుచ్చింది. మీరు మా మూవీకి అందిస్తున్న మ్యూజిక్ కోసం ప్రపంచం అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోంంటూ క్యాప్స‌న్ ఇచ్చారు.

అయితే ఆర్ ఆర్ ఆర్ టీమ్ రిలీజ్ చేసిన ఈ పోస్ట‌ర్‌లో కీరవాణి వయోలిన్ వాయిస్తూ కనిపించ‌డం మెస్మ‌రైజ్ చేస్తోంది. ఇక మ‌రో ఆసక్తికరమైన విష‌యం ఏమిటంటే ఇప్పటి దాకా ఈ మూవీ రిలీజ్ మీద అనేక సందేహాలు కొనసాగుతుండగా ఈ పోస్టర్ మీద కూడా 13 అక్టోబర్ 2021 సినిమాను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్రకటించడంతో అనుమానాలు అన్నీ పటాపంచలై పోయాయ‌ని తెలుస్తోంది. దర్శక దిగ్గజం రాజమౌళి తీస్తున్న ప్ర‌తి సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం అంద‌రికీ తెలిసిందే.