బాలీవుడ్‌లో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన `ఖిలాడి` భామ‌?!

గల్ఫ్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన డింపుల్ హయాతి.. గద్దలకొండ గణేష్ సినిమాలో జ‌ర్ర జర్ర సాంగ్‌తో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ మాస్ మ‌హారాజా ర‌వితేజ, డైరెక్ట‌ర్ రమేష్ వర్మ కాంబోలో తెర‌కెక్కుతున్న ఖిలాడి సినిమాలో ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అలాగే ప‌లు త‌మిళ చిత్రాల్లోనూ న‌టిస్తున్న డింపుల్ హ‌యాతి.. తాజాగా బాలీవుడ్ నుంచి ఓ బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇండియ‌న్ స్టార్ డైరెక్టర్ శంకర్, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అప‌రిచితుడు రీమేక్‌.

ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు. ఈ హిందీ రీమేక్ లో డింపుల్ హ‌యాతి కి ఓ కీలక పాత్ర ఇవ్వనున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ఖిలాడి భామ రోల్ ఏంట‌న్న‌ది తెలియాల్సి ఉంది.