సత్యదేవ్ ‘తిమ్మరుసు’ బర్త్ డే పోస్టర్ రిలీజ్..!

జ్యోతిలక్ష్మీ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి విభిన్న సినిమాల్లో విలక్షణ పాత్రలలో నటించి సలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ ఈరోజు అనగా జులై 4న తన 33వ వసంతంలోకి అడుగుపెట్టారు. 1989లో విశాఖపట్నంలో జన్మించిన సత్యదేవ్ వైజాగ్ లోనే పాఠశాల విద్య పూర్తి చేశారు. అనంతరం విజయనగరం లోని ఎంవీజీఆర్ కాలేజ్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత బెంగళూరులో కొద్ది సమయం పాటు సాఫ్ట్ వేర్ జాబ్ చేశారు.

అనంతరం హైదరాబాద్ కి మకాం మార్చి నటుడిగా అవతారమెత్తారు. 10 సంవత్సరాల లోనే స్టార్ డమ్ తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం ఆయన ‘గుర్తుందా శీతాకాలం’, ‘తిమ్మరుసు’, ‘గాడ్సే’ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా తిమ్మరుసు యూనిట్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో సత్యదేవ్ ఇంటరెస్టింగ్ లుక్ తో కనిపించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో ‘అసైన్‌మెంట్‌ వాలి’ అనే ట్యాగ్ లైన్ తో.. లీగల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.