రామ్ చరణ్ గా వార్నర్ అదరహో…!

ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ డేవిడ్‌ వార్నర్ కు తెలుగు ప్రేక్షకులను అలరించ‌డం చాలా ఇష్టం. ఏదో ఒక తెలుగు హీరో మూవీకి సంబంధించిన వీడియోలతో తన ఫేస్‌ను స్వాపింగ్‌ చేస్తూ వారి లాగే చేయ‌డం వార్న‌ర్‌కు అలవాటు. అయితే వార్నర్‌ ఈసారి మాత్రం మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ను ఇమిటేట్ చేశాడు. వినయ విధేయ రామ మూవీలోని ఫైటింగ్‌ వీడియోకి తన ఫేస్‌ను ఆడ్ చేసి అద్భుతంగా క్రియేట్ చేశాడు.

వార్న‌ర్ ఈ వీడియోలో సేమ్ చెర్రీలాగానే ఫైటింగ్‌, డైలాగులు చెప్పి మ‌రీ అభిమానులకు కనులవిందును క‌లిగించాడు. ఇక ఆ వీడియోను శనివారం ఇన్‌స్టా్గ్రామ్‌లో పంచుకోవడంతో తెగ లైకులు, కామెంట్లు వెల్లువ‌లా కురుస్తున్నాయి. వార్నర్ గ‌తేడాదిగా సామాజిక మాధ్యమాల్లో ఇలా వీడియోలు పంచుకున్న సంగతి తెలిసిందే. ఇండియ‌న్ సినిమాల స్టార్ హీరోల వీడియోలకు తన ఫేస్‌ను ఆడ్ చేసిన‌ వార్న‌ర్ వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన ప్రభాస్‌, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, అల్లుఅర్జున్ ల సాంగ్స్‌కు కూడా స్టెప్పులు వేశాడు.