ఐపీఎల్‌కు బీసీసీఐ కొత్త రూల్‌.. రైనాపైనే చ‌ర్చ‌..!

ఐపీఎల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక 2022 సీజన్‌ని 10 జట్లతో నిర్వహించాలని ఇప్ప‌టికే బీసీసీఐ ప‌క్కా ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఇదే విషయమై ఇప్పటికే కొన్ని హింట్స్ ఇచ్చినా బీసీసీఐ ఎలాగైనా ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలాన్ని ఈ ఏడాది చివరి క‌ల్లా నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. కాగా రెండు జట్లు కొత్తగా టోర్నీలోకి వస్తుండగా.. ఓ కొత్త రూల్‌ని కూడా బీసీసీఐ స్ప‌ష్టంగా తీసుకొచ్చింది. దాంతో అన్ని ఫ్రాంఛైజీల్లో ఇప్పుడు కొత్త గుబులు స్టార్ట్ అయింది.

ఇక ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందే ఈ ఫ్రాంఛైజీలకి ఎక్కువ‌గా నలుగురు ఆటగాళ్లని మాత్రమే రిటైన్ చేసుకునే ఆప్ష‌న్ ఉంటుంద‌ని స‌మాచారం. అది కూడా ముగ్గురు భారత క్రికెటర్లు కాగా ఒక విదేశీ క్రికెటర్ లేదా ఇద్దరు భారత క్రికెటర్లు అయినా ఉండి ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉండాల‌నేది ఫ్రాంఛైజీల కు ఇచ్చిన ఆప్ష‌న్‌. ఇక జ‌ట్లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జీతాల‌తో పాటు వేలానికి ముందు ఫ్రాంఛైజీల పర్స్ వాల్యూ నుంచి తగ్గించే అవకాశం ఉంది. ఇక ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ కు ఫస్ట్ ఛాయిస్ కింద మహేంద్రసింగ్ ధోనీ, ఆ తర్వాత సురేశ్ రైనాతో పాటు జడేజా పేర్లని అభిమానులు చెబుతున్నారు.