శ్రుతిహాసన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఇటీవల క్రాక్, వకీల్ సాబ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుని మంచి జోరు మీద ఉన్న శ్రుతి.. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తోంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్‌గా ఉండే శ్రుతి.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చి ఫాలోవర్స్‌తో ముచ్చటించింది.
ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా బదులిచ్చింది. ఈ క్రమంలోనే ఓ తుంటరి నెటిజన్.. నన్ను పెళ్లి చేసుకొంటావా? అని ప్రశ్నించాడు. అందుకు శ్రుతి ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే కుదరదంటే కుదరదని షాకింగ్ రిప్లై ఇచ్చింది.
మరో నెటిజన్ మీ పర్సనల్ మొబైల్ నంబర్ కావాలి అంటూ అడగగా.. శ్రుతి అబ్బో.. నా నెంబర్ కావాలా అంటూ నవ్వుతూ నో చెప్పింది. ప్రభాస్ సలార్‌లో మీ పాత్ర ఏమిటి? అందులో క్రాక్ సినిమాలో మాదిరిగా ఫైట్ చేస్తున్నారా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా..సలార్‌లో నాది మంచి పాత్ర. ఇప్పుడు వివరాలు వెల్లడించలేను. అయితే నాకు ఫైట్స్ లేవని శ్రుతి తెలిపింది.