ప్రభాస్, చిరుల మ‌ధ్య ర‌గ‌డ‌..ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌?!

June 9, 2021 at 10:31 am

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, మెగాస్టార్ చిరంజీవి మ‌ధ్య ర‌గ‌డేంటి..? అస‌లేమైంది..? అన్న డౌట్ మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న పెద్ద చిత్రాల్లో ప్ర‌భాస్ – రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న రాధేశ్యామ్, చిరంజీవి – కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న ఆచార్య చిత్రాలు కూడా ఉన్నాయి.

అయితే వీటిలో ఆచార్య చిత్రం మే నెల‌లో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా మేక‌ర్స్ రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు. ఇక రాధేశ్యామ్ జూలై లో విడుద‌ల అవ్వాల్సి ఉంది. కానీ, ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో అది జ‌రిగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

అయితే ఈ రెండు చిత్రాలు కూడా ఒకే రేస్ లో నిలవనున్నాయని ఓ టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. వచ్చే దసరా రేస్ లో అటు ఆచార్య‌ను, ఇటు రాధేశ్యామ్‌ను విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భ‌విస్తున్నార‌ట‌. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే.. ప్రభాస్, చిరుల మ‌ధ్య బాక్సాఫీస్ ర‌గ‌డ కాయమ‌ని అంటున్నారు.

ప్రభాస్, చిరుల మ‌ధ్య ర‌గ‌డ‌..ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts