అరియానాకు వ‌ర్మ క్ష‌మాప‌ణ‌లు..కార‌ణం అదేన‌ట‌!

యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా గ్లోరీ వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఇండ‌ర్వ్యూ ద్వారా ఫుల్ పాపుల‌ర్ అయింది. అంతేకాదు, తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో ఛాన్స్ కొట్టేసి.. హౌస్‌లో అడుగు పెట్టింది. ఇక బిగ్ బాస్ ఫైన‌ల్స్ వ‌ర‌కు చేరినా.. టైటిల్ గెలుచుకోలేక‌పోయింది అరియానా.

కానీ, ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల అరియానతో ఇంటర్వ్యూ నేపథ్యంలో వర్మ జిమ్‌లో ఆమెతో కలిసి కసరత్తులు చేశాడు. అందుకు సంబంధించిన జిమ్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేశాయి. అయితే తాజాగా అరియానాకు క్ష‌మాప‌ణ‌లు చెబుతూ ఓ ట్వీట్ చేశాడు వ‌ర్మ‌.

హే అరియాన నువ్వు ఇచ్చిన బోల్డ్‌ ఇంటర్య్వూ టీజర్‌ విడుదలకు ఆలస్యమైనందుకు క్షమించు. సాంకేతిక లోపం వల్ల విడుదల చేయడం కుదరలేదు. ఈ రోజు రాత్రి 9:30 గంటలకు ఈ టీజర్‌ను విడుదల చేస్తున్నాం అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు వ‌ర్మ‌. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.