మెద‌డును ప‌నితీరును చెప్పే హెల్మెట్‌..!

ఇప్పుడున్న టెక్నాల‌జీ యుగంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూరుతున్నాయి. ఇదే క్ర‌మంలో ఇప్పుడు మ‌రో కొత్త ర‌కం టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చింది. అదేంటంటే.. మనిషి మెదడు పనితీరును ఈజీగా అంచానా వేసే హెల్మెట్ అందుబాటులోకి వచ్చేసింది. దీనిక‌న్న ప్రత్యేకత ఏంటంటే అది మీ మెదడును పూర్తిగా చదివేస్తుంద‌ని స‌మాచారం. దీని ద్వారా మెదడు పని తీరును ఈజీగా తెలుసుకునేందుకు మ‌న‌కు చాలా బాగా ఉపయోగపడుతుంది.

అయితే ఈ అద్భుతమైన హెల్మెట్‌ ను మాత్రం అమెరికాకు చెందిన కెర్నల్‌ సంస్థ డెవ‌ల‌ప్ చేసి అందుబాటులోకి తెచ్చింది. ఇక రాబోయే కొన్ని వారాల్లోనే అమెరికాలో ఈ హెల్మెట్‌ అందుబాటులోకి వ‌స్తుంద‌ని స‌మాచారం. ఈ హెల్మెట్‌ లాంటి వ‌స్తువును వ్యక్తి త‌న తలకు పెట్టుకోవాలి. హెల్మెట్‌లోని లేజర్‌ కిరణాలు త‌ల ద్వారా మెదడులోకి వెళ్లి మెదడులోని కొన్ని కోట్ల సంఖ్యలో న్యూరాన్లను బాగా అంచ‌నా వేస్తాయి.

వాస్త‌వంంగా మనకు ఏదైనా దెబ్బ త‌గిలినా లేదా ఇత‌ర అన్ని ర‌కాల ఆలోచనలన్నింటికీ ఇవే మూలం. అందువల్ల మెదడులోకి ప్రవేశించిన లేజర్‌ కిరణాలు వెంట‌నే న్యూరాన్ల పని తీరును ఈ హెల్మెట్ నుంచి పసిగట్టి ఆ ప్రాసెస్‌ను పూర్తిగా రికార్డు చేస్తాయి. అయితే ఈ హెల్మెట్‌ను రూపొంచడానికి మాత్రం తాను ఐదేళ్లు శ్రమించాన‌ని బ్రియాన్‌ జాన్సన్ అనే వ్య‌వ‌స్థాప‌కుడు వివ‌రించాడు. అమెరికాలోని కెర్నెల్‌ కంపెనీ తయారు చేసిన ఈ హెల్మెట్‌ అందుబాటులోకి వస్తే మాత్రం ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండబోవని వారు వివ‌రించారు.

కాగా ఈ హెల్మెట్‌ తయారు చేయ‌డానికి ఇప్పటి దాకా రూ.815 కోట్లు ఖర్చు అయ్యాయ‌ని జాన్సన్ తెలిపారు. కెర్నల్ కంపెనీ ఈ హెల్మెట్ ప‌రిక‌రాల‌ను మాత్రం పదుల సంఖ్యలో మార్కెట్‌లోకి తీసుకురానుంది. కాగా ఈ హెల్మెట్‌ ధర కేవ‌లం 50 వేల డాలర్లుగా తెలుస్తోంది. అయితే కెర్నల్ డెవ‌ల‌ప్ చేసిన ఈ పరికరాల్లో రెండు రకాల వ‌స్తువులు ఉన్నాయి. ఒకటి ఫ్లో కాగా రెండోది ఫ్లక్స్‌ ఫ్లో గా తెలుస్తోంది.