థర్డ్‌వేవ్ ముప్పు నుంచి త‌ప్పించుకోవాలంటే ఆ మూడే కీలకం!

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ఈ సృష్టినే అత‌లాకుత‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్ కంటే ఉధృతంగా సెకెండ్ వేవ్ ఉండ‌డంతో.. ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇక ఇప్పుడిప్పుడే సెకెండ్ వేవ్ అదుపులోకి వ‌స్తున్న త‌రుణంలో.. థ‌ర్డ్‌వేవ్‌పై అధికారులు చేస్తున్న హెచ్చ‌రిక‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నాయి.

అయితే ఈ థ‌ర్డ్‌వేవ్ ముప్పును త‌ప్పించుకోవాలంటే మొత్తం మూడంటే మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొద‌టిది.. వ్యాక్సిన్‌. క‌రోనా నుంచి ర‌క్ష‌ణ పొందాలంటే వ్యాక్సిన్‌నే ఏకైక ఆయుధం. అందుకే అంద‌రూ వీలైనంత తొందరగా వ్యాక్సిన్ తీసుకుంటే.. క‌రోనా మూడు లేదా ఆ తరువాతి దశల నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవ‌చ్చు.

అలాగే రెండొవ‌ది..కోవిడ్‌ నిబంధనలు పాటించడం. క‌రోనా ఉధృతి త‌గ్గింది క‌దా అని.. నిబంధ‌న‌లు నిర్ల‌క్ష్యం చేస్తే క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. అందుకే ముఖానికి మాస్కు పెట్టుకోవ‌డం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శానిటైజ్ చేసుకోవ‌డం చేస్తుండాలి.

ఇక మూడొవ‌ది..క‌రోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగించడం. కేసులు తగ్గిపోతున్నాయి కదా అని ప్రభుత్వాలు పరీక్షలు చేయడం తగ్గిస్తే ముప్పు మ‌రింత పెరుగుతుంది. అందుకే వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేస్తే.. నిర్ధారణయ్యే తక్కువ కేసులను ఐసొలేషన్‌లో ఉంచి వెంటనే చికిత్స కల్పించడం ద్వారా వైర‌స్ ఇత‌రుల‌కు సోక‌కుండా ఉంటుంది.