చేతులు క‌లిపిన‌ చిరు-అక్ష‌య్‌.. ఎందుకోస‌మంటే?

June 6, 2021 at 8:46 am

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ బిజీ స్టార్ అక్ష‌య్ కుమార్ చేతులు క‌లిపారు. అంటే వీరిద్ద‌రూ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా? అన్న డౌట్ మీకు వ‌చ్చే ఉంటుంది. కానీ.. చిరు, అక్ష‌య్ చేతులు క‌లిపింది కొత్త ప్రాజెక్ట్ కోసం కాదు. మారెందుకు అంటారా..? అక్క‌డికే వ‌స్తున్నా..

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ది ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ(ఎఫ్ఐసీసీఐ) ప్ర‌జ‌ల్లో కోవిడ్‌పై అవ‌గాహ‌న పెంచ‌డానికి `క‌రోనా కో హ‌రానా హై` అనే పేరుతో ఓ సామాజిక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని అనుకుంది.

ఈ కార్య‌క్ర‌మంలో క‌రోనా ఎలా వ్యాప్తి చెందుతుంది, ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి, క‌రోనా రాకుండా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏంటి? అనే విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా వివ‌రించ‌నున్నారు. అందుకోసం ఎఫ్ఐసీసీఐ సినీ తార‌ల స‌హాయం కోర‌గా.. ఈ కార్య‌క్ర‌మంలో బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్‌, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ హీరో ఆర్య మ‌రియు క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ పాల్గొని ప్ర‌జ‌ల‌కు క‌రోనాపై అవ‌గాహ‌న పెంచ‌నున్నారు.

చేతులు క‌లిపిన‌ చిరు-అక్ష‌య్‌.. ఎందుకోస‌మంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts