వరల్డ్‌బుక్‌లో చోటు ద‌క్కించుకున్న ఆనంద‌య్య‌!

అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం ఎక్క‌డిక‌క్క‌డ కోర‌లు చాచిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ మ‌హమ్మారి వ‌ల‌లో చిక్కుకుని ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోగా.. మ‌రెంద‌రో వైర‌స్‌తో పోరాటం చేస్తున్నారు. ఇక ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనంద‌య్య మందు అంద‌రికీ దివ్యౌష‌ధంగా క‌నిపిస్తోంది.

క‌రోనాకు విరుగుడుగా ప‌ని చేస్తున్న ఆనంద‌య్య మందుకు ప్ర‌భుత్వం కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. దాంతో ఆనంద‌య్య మందు పంపిణీ జోరుగా కొన‌సాగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆనంద‌య్య వ‌ర‌ల్డ్ బుక్‌లో చోటు ద‌క్కించుకున్నాడు. ఆనందయ్యకు తమ సంస్థ ద్వారా త్వరలో వరల్డ్‌బుక్‌లో చోటు కల్పిస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ బ్రాహ్మిన్స్‌ పార్లమెంట్‌(ఐబీపీ) రాష్ట్ర కార్యదర్శి దినవహి వెంకటనాగరాజ ప్రసాద్ స్వ‌యంగా ప్రకటించారు.

అంతేకాదు, త్వరలోనే ఆనందయ్యకు, ఆయన్ను ప్రోత్సహించిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కూడా లండన్‌ నుంచి రానున్న అవార్డులను నెల్లూరులో అందజేయనున్నారు.