మ‌రో వివాదంలో అడ్డంగా బుక్కైన ప్ర‌దీప్‌..ఏం జ‌రిగిందంటే?

June 21, 2021 at 10:38 am

ప్ర‌దీప్ మాచిరాజు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర టాప్ మేల్ యాంక‌ర్‌గా దూసుకుపోతున్న ఈయ‌న ఇటీవ‌లె 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాతో హీరోగా మారి అంద‌రి మ‌న‌సుల‌ను దోచుకున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌దీప్ ఓ వివాదంలో అడ్డంగా బుక్కైయ్యాడు.

తాాజాగా ఓ షోలో ప్రదీప్ ఏపీ రాజధాని విశాఖ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ప్ర‌దీప్ పొర‌పాటున అలా అన్నాడో.. లేదా కావాల‌నే అన్నాడో తెలియ‌దు. కానీ, ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్ర‌దీప్ త‌న వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని.. లేదంటే హైదరాబాద్‌లో ఉన్న అత‌డి ఇంటిని ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు వెల్లడించారు.

రైతులు, ప్రజల మనోభావాలు కించపర్చేలా వ్యవహరిస్తే బుద్ధి చెబుతామని.. అయినా కోర్టులోనే ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్‌ ఎలా మాట్లాడతారని శ్రీనివాసరావు మండిప‌డ్డారు. మ‌రి ఈ విష‌యంపై ప్ర‌దీప్ ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.

మ‌రో వివాదంలో అడ్డంగా బుక్కైన ప్ర‌దీప్‌..ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts