బుల్లితెర‌పై `జాంబిరెడ్డి` న‌యా రికార్డ్‌!

తేజ సజ్జా, ఆనంది జంట‌గా న‌టించిన చిత్రం జాంబిరెడ్డి. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఆపిల్ ట్రీస్ స్టుడియోస్ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ నిర్మించారు. కామెడీ, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం థియేట‌ర్ల‌లో విడుద‌లై సూపర్ డూపర్ హిట్ అందుకుంది.

టాక్ బాగుండడం, జాంబి జోనర్‌లో వచ్చిన తొలి తెలుగు సినిమా కావాడంతో బాక్సాఫీస్ వ‌ద్దే కాదు బుల్లితెర‌పై కూడా దుమ్ములేపింది. ఇక జాంబిరెడ్డి శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న‌ స్టార్ మా.. ఇటీవ‌ల‌ మొదటిసారి స్టార్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈ చిత్రాన్ని ప్రసారం చేయ‌గా ఏకంగా 9.7 టీఆర్పీ వచ్చింది. చిన్న సినిమాకు ఈ రేంజ్ రేటింగ్ రావ‌డం నిజంగా విశేష‌మే.

ఇక‌ రీసెంటుగా రెండోసారి ప్రసారం చేయబడిన ఈ సినిమా మ‌ళ్లీ అదిరిపోయే టీఆర్పీని దక్కించుకుని నయా రికార్డ్ క్రియేట్ చేసింది. రెండో సారి ఈ సినిమాకు 8.1 టీఆర్పీ సాధించింది. ఒక యంగ్ హీరో నటించిన సినిమాకు రెండో సారి కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం కూడా ఓ రికార్డే అని చెప్పాలి.