విజయ్ దేవరకొండ అలాచేసి చాలా బాధ‌పెట్టాడు:ప్ర‌ముఖ నిర్మాత

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తీరుపై ఆస‌హ‌నం వ్య‌క్తం చేశారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా. అభిషేక్ పిక్చర్స్‌ బ్యానర్‌పై ప‌లు సినిమాలను నిర్మించిన అభిషేక్ నామా.. వందలాది తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశారు. అలాగే విజ‌య్ హీరోగా తెర‌కెక్కిన వరల్డ్ ఫేమర్ లవర్ చిత్రానికి కూడా డిస్ట్రిబ్యూటర్‌గా వ్య‌వ‌హ‌రించి కోట్లలో నష్టపోయారు.

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అభిషేక్ నామా..వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాపై, విజ‌య్‌పై షాకింగ్ కామెంట్స్‌ చేశారు. ఆయ‌న మాట్లాడుతూ..
నా కెరియర్‌లో నన్ను బాగా బాధ పెట్టిన సంఘటన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా డిజాస్టర్ కావడం. ఈ చిత్రానికి 90 శాతం నష్టం వచ్చింది. అయితే సినిమా పోయిన తరువాత అసలు హీరో విజయ్ దేవరకొండ రెస్పాండ్ కాలేదు. ఫోన్ చేసినా.. క‌ట్ చేసేవారు. దాంతో చాలా బాధపడ్డా.

త‌మ వల్ల వాళ్ల డబ్బులు పోయాయని కాస్తైనా హీరోలు రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎన్నో కష్టాలు పడితే సినిమా అవుతుంది. కనీసం మోరల్ సపోర్ట్ అందించినా ఎంతో బావుంటుంది. కానీ, విజ‌య్‌కు ఆ రెస్పాన్సిబిలిటీ లేదు. ఈ విష‌యంలో ఆయ‌న మారాలి. విజ‌య్ నుంచి అదే కోరుకుంటున్నా.. అంటూ అభిషేక్ నామా పేర్కొన్నారు.