నాగ్ డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన మెగా ప్రిన్స్‌?!

మెగా ప్రిన్స్ వ‌రుణ తేజ్ ప్ర‌స్తుతం కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో గ‌ని అనే చిత్రం చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వ‌రుణ్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. అలాగే మ‌రోవైపు అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఎఫ్ 3లో వెంకీతో క‌లిసి న‌టిస్తున్నాడు వ‌రుణ్‌. ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి.

అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. మ‌రో ప్రాజెక్ట్‌ను వ‌రుణ్ లైన్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్రవీణ్‌ సత్తారు ఇటీవ‌ల వ‌రుణ‌తో ఓ మంచి క‌థ చెప్ప‌గా.. అది బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ట.

ఈ ప్రాజెక్ట్‌పై త‌ర్వ‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, ప్రవీణ్ స‌త్తారు ప్ర‌స్తుతం కింగ్ నాగార్జున‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి అయిన త‌ర్వాత వ‌రుణ సినిమాను సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని టాక్‌.