సూపర్ స్టార్ కృష్ణకి మహేష్ గిఫ్ట్ అదుర్స్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. గతంలో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నేడు మరోసారి బుర్రిపాలెం గ్రామ ప్రజలకు తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకొని ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో మహేష్ బాబు కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.

మహేష్ బాబు తాను నటించిన శ్రీమంతుడు అనే సినిమాలోని గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనే అంశాన్ని స్పూర్తిగా తీసుకుని.. ఏపీలోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు తన సాయాన్ని అందజేస్తున్నారు. ఇక ఈరోజు కృష్ణ పుట్టిన రోజు వేడుకులను నిరాడంబరంగా ఆయన అల్లుడు, నటుడు హీరో సుధీర్ బాబు ఇంట్లో నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎంపీ గల్లా జయదేవ్, నటుడు నరేష్, నిర్మాత, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు, కృష్ణ సతీమణి, కృష్ణ అల్లుడు సంజయ్ స్వరూప్ తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.