ప్రముఖ యాంకర్ సినిమాపై నెగటివ్ ప్రచారం..!

బుల్లి తెర యాంకర్ గా అలరిస్తున్న అందాల భామ అన‌సూయ ఇటు అంది వచ్చిన సినిమా అవకాశాలు కూడా చేస్తూ న‌టిగా మంచి గుర్తింపు పొందుతుంది. వైవిధ్యమయిన సినిమాలు చేస్తూ తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది అనసూయ. తాజాగా ఈమధ్యనే కొత్త దర్శకుడు రమేష్ రాపర్తి ద‌ర్శ‌క‌త్వంలో థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ అనే సినిమాలో నటించింది అనసూయ. ఈ చిత్రంలో అశ్విన్ విరాజ్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు.

ఏప్రిల్ 30న థియేట‌ర్ లో రిలీజ్ కావ‌ల‌సిన ఈ సినిమా క‌రోనా రెండో వేవ్ తీవ్రత వల్ల ఆహాలో మే 7న స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో అన‌సూయ గ‌ర్భ‌వ‌తిగా క‌నిపించటం మరో విశేషం. కానీ ఇప్పుడు తాజాగా మ‌రి కొద్ది రోజుల‌లో రిలీజ్ కాబోతున్న థాంక్ యూ బ్ర‌దర్ చిత్రం పై నెగెటివ్ రుమౌర్స్ వస్తున్నాయి. ఈ మూవీ గతంలో వ‌చ్చిన ఎలివేటర్ బేబీ అనే నైజీరియన్ మూవీకి కాపీ అంటూ నెటిజ‌న్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిత్రం విడుదల అయ్యే వరుకు అస‌లు విష‌యం ఏంటో పూర్తిగా తేలేదు. కాబ్బటి సినిమా రిలీజ్ అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే.