బన్నీ హీరోయిన్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో రష్మిక ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తన అందంతో, నటనతో కుర్రకారు మనసు దోచుకుంది. ప్రస్తుతం రెండు చేతులా నాలుగు సినిమాలు చేస్తూ హడావుడిగా తన సినీ జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రష్మిక కొన్ని తన మనసులోని మాటలను చెప్పింది. రష్మికకు క్రికెట్ అంటే బాగా ఇష్టమని చెప్పొకొచ్చింది. క్రికెట్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాని ఈ అందాల భామ తెలిపింది.

షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా అవకాశం దొరికినప్పుడల్లా క్రికెట్ చూడడానికి ఇష్టపడుతానని తెలిపింది. తాజాగా సోషల్ మీడియాలో రష్మిక ” మీ ఫెవరేట్ క్రికెటర్ ఎవరు..? ” అనే ప్రశ్న ఎదురైంది. వెంటనే రష్మిక ” నా హీరో మహేంద్ర సింగ్ ధోనీ ” అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందాన. ధోనీ బ్యాటింగ్, కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ అంటే పడి చచ్చిపోతానని, అతనో మాస్టర్ క్లాస్ ప్లేయర్ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక బన్నీ సరసన పుష్ఫ సినిమాలో నటిస్తోంది.