నిర్మాతలకు శర్వానంద్ నోటీసులు.. ఏం జ‌రిగిందంటే?

వివాదాల‌కు ఎప్పుడూ ఆమ‌డ దూరంలో ఉండే హీరో శ‌ర్వానంద్‌.. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న‌ట్టు తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. శ‌ర్వానంద్ చివ‌రి చిత్రం శ్రీ‌కారం. బి. కిషోర్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానరులో రామ్ అచంట, గోపిచంద్ అచంట నిర్మించారు.

మార్చిలో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. దాంతో శర్వానంద్‌ కు ఇవ్వాల్సిన రెమ్యున‌రేష‌న్‌లో నిర్మాతలు కోత కోసినట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా కోసం శర్వానంద్‌ 6 కోట్ల రెమ్యున‌రేష‌న్‌ను ఒప్పందం చేసుకోగా అందులో నాలుగు కోట్లు ముందే ఇచ్చారు. కానీ మిగిలిన‌ బ్యాల‌న్స్ మాత్రం ఇవ్వ‌కుండా ఇబ్బంది పెడుతున్నార‌ట‌.

బ్యాల‌న్స్ అమౌంట్ కోసం శర్వా ఎంత అడుగుతున్నా.. నిర్మాతల వైపు నుండి ఎలాంటి స్పందన లేద‌ట‌. దాంతో శ్రీ‌కారం నిర్మాత‌ల‌కు శ‌ర్వానంద్‌ లీగల్ నోటీసులు పంపారని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంత ఉందో తెలియాలంటే.. శ‌ర్వా లేదా శ్రీ‌కారం నిర్మాత‌లు స్పందించాల్సిందే.