అంత బాగుంది.. కానీ చివర్లో ట్విస్ట్ అదుర్స్ : పూరి

కరోనా వల్ల దేశ పరిస్థితులు బాగా మారిపోయాయి. కరోనా సోకి చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇలాంటి తరుణంలో డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఓ సంచలన విషయం తెలిపారు. అయితే ఆ తర్వాత అందులో ఓ ట్విస్ట్ కూడా ఇచ్చారు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వైరస్ వల్ల చాలా మంది తాము ఉన్న చోటు కాకుండా వేరే ప్రాంతానికి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. ఇటువంటి వారు ఇతర దేశాలకు వెల్లాలంటే ఓ మార్గం ఉంది. చాలా దేశాలు ద్వంద్వ పౌరసత్వాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. దీనినే పూరీ జగన్నాథ్‌ వివరించారు.

ఆ పౌరుసత్వాన్ని కనుక తీసుకుంటే మనం ఇక్కడైనా, అక్కడైనా ఉండొచ్చు. కరేబియన్‌ ద్వీపంలోని డొమినికా అక్కడ రియల్‌ ఎస్టేట్‌లో కనుక రూ.కోటి పెట్టుబడి పెడితే కుటుంబంలో ఉన్న వాళ్లందరికీ డ్యూయల్‌ సిటిజెన్‌షిప్‌ లభిస్తోంది. అంతేకాకుండా ఈ డొమినికా పాస్‌పోర్ట్‌ కనుక మీకు ఉంటే 130 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా వెళ్లి రావొచ్చు. టర్కీ పాస్‌పోర్ట్‌ ఉంటే 112 దేశాలకు వెళ్లి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇండియా ఇలాంటి సిటిజెన్‌షిప్‌కి ఒప్పుకోదు. అదే ట్విస్ట్‌ అని పూరీ తెలిపారు.