హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న బలనటుడు..!?

సినీ పరిశ్రమలో చాలా మంది బాలనటులు కాస్త పెద్దయ్యాక హీరోలుగా మారుతుంటారు. వారిలో కొంతమంది హీరోగా సక్సెస్ అవుతారు. కొంతమంది సక్సెస్ కాలేకపోతారు. ఇప్పుడు టాలీవుడ్ లో మరో బాలనటుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ‘బాహుబలి, రేసుగుర్రం, మళ్ళీ రావా, డీజే, నా పేరు సూర్య’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాత్విక్ వర్మ ఇప్పుడు “బ్యాచ్” అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తుండగా, రఘు కుంచె మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో సాత్విక్ కి జంటగా నేహా పఠాన్ నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమా క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో, కాలేజీ కుర్రాళ్ల కథగా తెరకెక్కుతున్నట్లు దర్శకుడు శివ తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ను జనవరిలో మొదలెట్టామని.. హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడలో 59 రోజుల షెడ్యూల్ లో షూటింగ్ కంప్లీట్ చేశామని నిర్మాత రమేశ్ తెలిపారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామన్నారు.