కరోనాను అంతం చేసే మాస్క్ వచ్చేసింది!

కరోనాను అంతం చేయడానికి మాస్కులు, శానిటైజర్లు వాడుతున్న విషయం తెలిసిందే. అయితే మాస్కులు ఎన్ని రకాలు వాడినప్పటికీ కరోనా అనేది కొంత మందిని వదలడం లేదు. దీంతో శాస్త్రవేత్తలు ఆ దిశగా పరిశోధనలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇంటర్ విద్యార్థిని ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు మాస్క్ అంటే కరోనా సోకకుండా కాపాడే ఆయుధంగా భావిస్తున్నాం. కానీ తాజాగా కరోనా వైరస్ ను చంపే మాస్కు కూడా వచ్చింది. 12వ తరగతి విద్యార్థిని దీనిని అభివృద్ధి చేసింది.

 

పశ్చిమ బెంగాల్ పుర్బ బర్ధమాన్ జిల్లాకు చెందిన దిగ్నాటికా బోస్ ఇంటర్ సెకండియర్ చదువుతోంది. కరోనాను అంతం చేయడానికి తనకు వచ్చిన ఓ ఆలోచనను ఆచరణ రూపంలో పెట్టింది. కరోనాను చంపే మాస్కును రూపొందించింది. ఈ మాస్క్ ను ముంబైలోని గూగుల్స్ మ్యూజియం ఆఫ్ డిజైన్ ఎక్సలెన్స్ లో ప్రదర్శించారు. కోవిడ్ పేషెంట్లు ఈ మాస్క్ ను వినియోగిస్తే వారు త్వరగా కోలుకోగలుగుతారని తెలిపింది.