వైరల్ అవుతున్న దీప్తి ఎమోషనల్ వీడియో..!

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన స్టార్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో దీప్తి సునైనా కూడా ఒకరు. డబ్ స్మాష్ వీడియోస్ చేస్తూ తన కెరీర్ మొదలు పెట్టి ఆ తరువాత మూవీ కవర్ సాంగ్స్ కి డాన్స్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తరువాత దీప్తి బిగ్ బాస్ సెకండ్ సీజన్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు పొందింది. దీప్తి ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ రీల్స్ పోస్ట్ చేస్తూ తెగ సందడి చేస్తోంది. ప్రస్తుతం దీప్తి వీడియోస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ అవుతున్నాయి.

తాజాగా దీప్తి చేసిన ఆ తట్టుకోలేదే సాంగ్ రీల్ వీడియో ఒక్కటి బాగా పాపులర్ అయింది. ఆ వీడియోలో ఎమోషనల్ గా నటించిన దీప్తిని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వక తప్పదు. గతంలో దీప్తి కిరాక్ పార్టీ అనే మూవీలో తళుక్కు మంది. చూడాలి మరి భవిష్యత్తులో దీప్తి ఏదైనా మూవీ లేక వెబ్ సిరీస్ లో కనిపించి సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి మరి.

Share post:

Popular