లూసిఫర్ రీమేక్ టైటిల్ ఇదే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం తర్వాత డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. మలయాళంలో ప్రముఖ నటుడు మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ సినిమాకి రీమేక్ గా రానుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేయనున్నారు.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రామ్ చరణ్ తో పాటు ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీకి ఆసక్తికర టైటిల్ ఖరారు అయిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాకి కింగ్ మేకర్ అనే టైటిల్ ఫిక్స్ చేసారని సినీవర్గాలో వినిపిస్తుంది. మరి ఇందులో నిజా నిజాలు ఎంత వరుకు ఉన్నాయో తెలియాలంటే మూవీకి సంబందించిన అప్డేట్ వచ్చేవారుకూ వేచి చూడాల్సిందే.