అమల అక్కినేని జిమ్ వీడియో వైరల్

ఇప్పుడున్న క‌రోనా స‌మ‌యంలో శ‌రీరానికి వ్యాయామం, ఎక్స‌ర్ సైజులు ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే శారీర‌క వ్యాయామాలు త‌ప్ప‌నిస‌రి. అయితే ఇక సెల‌బ్రిటీల సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వారు ఎక్కువ‌గా జిమ్‌లోనే క‌స‌ర‌త్తులు చేస్తుంటారు. ఇక మ‌రీ ముఖ్యంగా టాలీవుడ్‌లో అక్క‌నేని ఫ్యామిలీ జిమ్‌లో వ‌ర్కౌట్లు చేయ‌డంలో ఎక్కువ‌గా స‌మ‌యం కేటాయిస్తుంది.

అందుకే కావ‌చ్చు వారి ఫ్యామిలీలో వ‌య‌స్సు వ‌చ్చినా ఇంకా యంగ్‌గానే క‌నిపిస్తుంటారు. ఇప్పుడు నాగార్జున స‌త‌మ‌ణి అమ‌లుజిమ్‌లో చేస్తున్న వ‌ర్కౌట్ల‌కు సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారింది. ఆమె బ‌రువులు మోస్తున్న వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా తెగ వైర‌ల్ అవుతోంది. దీన్ని చూసిన అభిమానులు స‌మంత జిమ్ వీడియోను క‌లిపి షేర్ చేస్తున్నారు. ఈవీడియోకు ల‌క్ష‌ల్లో వ్యూస్ వ‌చ్చాయి. అలాగే వేల‌ల్లో కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్లు. అత్తా కోడ‌ల్లు క‌లిసి జిమ్‌లో తెగ క‌ష్ట‌ప‌డుతున్నారంటూ అంతా కామెంట్లు చేస్తున్నారు. మీరూ చూడండి వీడియోను.