రష్మిక ను భరించడం చాలా కష్టమంటున్న కార్తీ..ఎందుకంటే …!?

Rashmika who will act with Akkineni hero

తాజాగా హీరో కార్తీ తమిళం, తెలుగు భాషలో సుల్తాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో హీరో కార్తీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, కేజిఎఫ్ చిత్ర ఫేమ్ గరుడ రామచంద్ర రాజు ఒక కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గా హీరో కార్తీ మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ పాల్గొని ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను అందరితో పంచుకున్నాడు.

దీనిలో భాగంగా ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన బ్యూటీ రష్మిక మందన్న చిత్ర యూనిట్ సభ్యులతో చాలా బాగా ఆక్టివ్ గా ఉండేదని, చాలా బాగా కలిసిపోయిందని అందువల్లనే ఎప్పుడు కూడా షూటింగ్ జరుగుతున్న టైములో సెట్లో ఆహ్లాదకరంగా ఉండేదని కార్తీ చెప్పుకొచ్చాడు. ఇంకా రష్మిక అల్లరి కూడా బాగా చేసేదని రష్మిక ను భరించడం చాలా కష్టమని సరదాగా చెప్పుకొచ్చాడు.అలాగే ఆమెతో గడుపుతున్నంతసేపు టైం అస్సలు తెలియదని కితాబిచ్చాడు హీరో కార్తీ.