మొదలైన అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్స్..!

దేశంలో పవిత్రమయిన అమరనాథ్ యాత్రకు భక్తుల రిజిస్ట్రేషన్ మొదలయింది. దేశ వ్యాప్తంగా 446 బ్యాంకు శాఖల ద్వారా ఈ యాత్ర చేయాలనుకునే భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అమరనాథ్ యాత్ర చేయాలనుకునే భక్తులు మార్చి 15వతేదీ తర్వాత జారీ చేసిన ఆరోగ్య ధ్రువపత్రాలను సమర్పించాలి. ఇంకా గర్భిణులు, 13 ఏళ్ల లోపు పిల్లలు, 75 ఏళ్లకు పైబడిన వారు అమరనాథ్ యాత్రకు నమోదు చేసుకోలేరు. హెలికాప్టర్లలో ప్రయాణించాలనుకునే భక్తులకు ముందస్తు నమోదు అవసరం లేదు.

ఈ సంవత్సరం అమరనాథ్ యాత్రకు వచ్చే భక్తులకు 3లక్షల రూపాయల గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కవరు అందించాలని నిర్ణయించారు. 2021 అమర్‌నాథ్ యాత్ర జూన్ 28 నుంచి మొదలు కానుంది. జమ్మూ కశ్మీర్‌లోని అమరనాథ్ గుహల్లో కొలువైన మంచు శివ లింగాన్ని భక్తులు దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం జరిగే అమర్‌నాథ్ యాత్ర ఈ సంవత్సరం 56 రోజుల పాటు కొనసాగనుంది. ఆగస్ట్ 22న ఈ యాత్ర ముగుస్తుంది.

కాబ్బటి వెంటనే భక్తులంతా అమర్నాథ్ యాత్రకి రెజిస్టరషన్ చేసుకోటానికి ఈ కింద లింక్
http://www.jammu.com/shri-amarnath-yatra/registration-form.php లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు.