బాల‌య్యకు ఫాలోవ‌ర్‌గా మార‌నున్న‌ మంచు వారి అబ్బాయి?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `బిబి3` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వీరి కాంబోలో తెర‌కెక్కుతున్న మూడో చిత్రమిది. దీంతో ఇప్ప‌టికే ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ మూవీ రూపొందుతోంది. ఇంకా టైటిల్ ప్ర‌క‌టించిన ఈ చిత్రం మే 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఈ చిత్రంలో మంచు వారి అబ్బాయి మంచు మనోజ్ కూడా ఉంటాడ‌ట‌. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం..ఈ చిత్రంలో మంచు మనోజ్ క్యారెక్టర్ ఇంటర్వెల్ లో వస్తోందని.. బాలయ్య పాత్రను ఫాలో అయ్యే ఫాలోవర్ గా మనోజ్ పాత్ర ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో చూడాలి.