బుల్లి న‌డుముతో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన రాశిఖ‌న్నా..వీడియో వైర‌ల్‌!

రాశిఖ‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొద‌టి సినిమాతోనే క‌ర్ర‌కారు హృద‌యాల‌ను గెలుచుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

ప్ర‌స్తుతం రాశి తెలుగులో ప‌లు చిత్రాల‌తో పాటు హిందీలో ఓ వెబ్ సి‌రీస్ చేస్తోంది. ఈ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ హీరోగా న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కెరీర్‌లో మొద‌ట్లో బొద్దుగా ఉండే రాశి.. ఇప్పుడు నాజూగ్గా మారిపోయింది. అంతేకాదు, ఎప్ప‌టిక‌ప్పుడు త‌న నాజూకు న‌డుముతో వ‌య్యారాలు వ‌ల‌క‌బోస్తూ ఫొటోలు కూడా షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఓ డ్యాన్స్ వీడియో షేర్ చేసింది రాశి. `ఎంజాయ్‌ ఎంజమ్మి’ అంటూ సాగే ఓ తమిళ్‌ సాంగ్‌కు త‌న బుల్లి న‌డుము తిప్పుతూ స్టెప్పులు వేసింది రాశి. ఈ డ్యాన్స్ వీడియో అభిమానుల‌తో పాటు నెటిజ‌న్ల‌ను కూడా తెగ ఆక‌ట్టుకుంటోంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

https://www.instagram.com/p/CNKjGpqAqDb/?utm_source=ig_web_copy_link