కీలక నిర్ణ‌యం తీసుకున్న ప్రముఖ నిర్మాత…!?

ఒక‌ప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అల‌రించిన ఛార్మి ఇప్పుడు నిర్మాత‌గా వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తుంది. ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత ఛార్మి ప్ర‌స్తుతం లైగ‌ర్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తుంది. సోష‌ల్ మీడియా ద్వారా ఈ మూవీ సంగ‌తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తూ వ‌స్తున్న ఛార్మి తాజాగా ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అంద‌రిలో ఉత్సాహాన్ని నింపే ప్ర‌య‌త్నం చేశాను, కాని ఇక నా వ‌ల్ల కావ‌డం లేదు. మ‌న దేశ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. అందుకే సోష‌ల్ మీడియాకు కొద్ది రోజులకు దూరంగా ఉండాల‌ని అనుకుంటున్నాను. అందరు జాగ్ర‌త్త‌గా ఉండండి అంటూ చేతులెత్తి కోరింది.

క‌రోనా కారణంగా ప‌రిస్థితి చాలా భ‌యంక‌రంగా మారుతుంది. వీట‌న్నింటిని చూసి త‌ట్టుకునే శ‌క్తి నాకు ఇక లేదు. అందుకే కొద్ది రోజుల పాటు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌ని నేను నిర్ణ‌యించుకున్నాను. అందరు వారి ఇంట్లోనే ఉంటూ, మీరు ప్రేమించే వారిని జాగ్ర‌త్త‌గా చూసుకోండి అంటూ ఛార్మి త‌న పోస్ట్‌ ద్వారా తెలిపింది.

I try to keep everyone’s energy high , but I now give up ?? our country is in very bad condition ???
Take care guys ????#stayhome #staysafe #covid_19 #2021 pic.twitter.com/LR7UxIA4sx
— Charmme Kaur (@Charmmeofficial) April 19, 2021