బాక్సింగ్ ఇర‌గ‌దీస్తున్న శ్రుతి హాస‌న్‌..వీడియో వైర‌ల్‌!

శ్రుతి హాస‌న్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌మ‌ల్ హాస‌న్ కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతి తెలుగు, త‌మ‌ళ మ‌రియు హిందీ భాష‌ల్లో న‌టించి.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

ఇక లాంగ్ గ్యాప్ త‌ర్వాత `క్రాక్‌` సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రుతి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ప్ర‌భాస్ స‌ర‌స‌న `స‌లార్‌` చిత్రంతో పాటు ప‌లు ప్రాజెక్ట్స్‌లో కూడా న‌టిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజ‌గా శ్రుతి హాస‌న్ షేర్ చేసిన వీడియో అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియోలో కోచ్‌తో క‌లిసి బాక్సింగ్ ఇర‌గ‌దీస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. మ‌రి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేసేయండి.

Share post:

Popular